ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో విడుదల ఓ లేఖ చర్చనీయాంశంగా మారింది. వివిధ సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఈ ఐదు పేజీల లేఖ వైరల్ అయింది. దీంతో పోలీస్ శాఖ, రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఎస్ఈసీ రమేష్ కు ఒక గార్డ్ (1+4) తో భద్రత ఉండగా..దానిని 1+1 (2+8)కు పెంచింది రాష్ర్ట పోలీస్ శాఖ. అలాగే ఇద్దరు గన్ మెన్లను ఇచ్చింది. మరో పోలీస్ అధికారిని రమేష్ కుమార్ పర్యవేక్షణ కోసం నియమించారు. కాగా..సీఆర్పీఎఫ్ భద్రత కోసం రమేష్ కుమార్ ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు, డీజీపీకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ..రమేష్ కుమార్ పేరుతో విడుదలైన ఆ ఐదు పేజీల లేఖలో ఏముంది. ఆ లేఖ ఆధారంగా పోలీసులు ఎందుకు రమేష్ కుమార్ కు భద్రత పెంచాల్సి వచ్చిందన్న సందేహాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Also Read : ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..

కాగా..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, పార్థసారథి, జోగి రమేష్, మల్లాది విష్ణు తదితరులు డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో వెలువడిన లేఖ మీడియాలో ప్రసారమైనప్పటి నుంచి రాష్ర్ట ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో వైసీపీ పై చేసిన ఆరోపణలపై లోతైన విచారణ జరిపి..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : కరోనా ఉందని రాళ్లతో కొట్టి చంపేశారు..!

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.