హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే తమదైన శైలిలొ వాయింపు మొదలు పెట్టింది. ప్లాట్‌ ఫామ్ ధరను పెంచింది. టికెట్ ధర రూ.10ల నుంచి రూ.30లకు పెంచింది. పెంచిన ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమల్లోకి వస్తాయి. ఈ రోజు నుంచి అక్టోబర్ 10 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువుల తాకిడిని అరికట్టడానికి..ఆదాయం పెంచుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ ఫామ్ టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచుతుంది. అయితే…గతంలో 10 నుంచి రూ.20లకు పెంచేవారు. ప్రస్తుతం ఏకంగా రూ.30లకు పెంచారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.