అమరావతి: సీనియర్‌ జర్నలిస్ట్ రామచంద్రమూర్తిని ఏపీ ప్రభుత్వం తగిన విధంగానే గౌరవించింది. ఆయనను పబ్లిక్‌ ఫాలసీ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రమూర్తికి కేబినెట్ హోదా కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్‌ జర్నలిస్ట్ అమర్‌ను ఏపీ ప్రభుత్వం నేషనల్ మీడియా అడ్వైజర్‌గా నియమించుకుంది. అయితే..సాక్షిలో రిటైర్డ్ అయిన వారిని ఏపీ ప్రభుత్వం ప్రజాసొమ్ముతో పోషిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమర్‌, రామచంద్రమూర్తి ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఏపీలో జర్నలిస్ట్‌లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story