అమరావతి: పీపీఏల పునఃసమీక్ష విషయంలో బాబుకు గట్టి షాకే తగిలింది.  విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలను సమీక్షించొద్దంటూ చంద్రబాబు ముందే యాగి చేశాడు. విద్యుత్ సంస్థలు కూడా పునఃసమీక్షకు ప్రభుత్వానికి అవకాశం లేదని వాదించాయి. కాని.. హైకోర్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయవచ్చని అనుమతి ఇచ్చింది. పీపీఏల్లో ఎలాంటి అన్యాయం జరగలేదంటూ బుకాయించిన చంద్రబాబుకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అయ్యింది. కేంద్రం సైతం విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలు చేయొద్దని, పెట్టుబడులు ఆగిపోతాయనే సాకులకు అడ్డుకట్ట పడింది. ఒప్పందంలోని యూనిట్ రూ.6 రేటుతో కాకుండా ప్రస్తుతం ఉన్నయూనిట్ కు రూ.2.34 నుంచి రూ.2.44 ధర చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు అనుమతించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.