దేవులపల్లి అమర్ కు కేబినెట్ హోదా ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 4 Oct 2019 5:14 PM IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ నేషనల్ మీడియా అడ్వైజర్ దేవులపల్లి అమర్‌కు కేబినెట్ హోదా ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆయనను సీఎం జగన్..నేషనల్ మీడియా అడ్వైజర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సాక్షి టీవీ పెట్టినప్పటి నుంచి దేవులపల్లి అమర్ అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ అనే ప్రోగ్రాంలో చర్చాగోష్టులు నిర్వహించేవారు. ఏపీలో జగన్ గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనను నేషనల్ మీడియా అడ్వైజర్‌గా తీసుకున్నారు. వైఎస్ఆర్‌తో కూడా అమర్‌కు మంచి సంబంధాలు ఉండేవి. వైఎస్ఆర్ అకాల మరణం తరువాత కూడా జగన్‌తో ఆయన మంచి సంబంధాలు కొనసాగించారు. దానికి ప్రతిఫలంగానే..అమర్‌కు కేబినెట్ హోదా దక్కిందని సమాచారం. వైఎస్ఆర్ కుటుంబ అభిమానిగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కు మంచి పేరుంది.
Next Story