ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సహా మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది ప్రభుత్వం. రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 21వ తేదీన తొలి దశ, 24వ తేదీన రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 27న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఫలితాలు ఈనెల 29న వెలువడనున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.