ఏపీలో 17 మంది ఐపీఎస్‌ల బదిలీలు

By సుభాష్  Published on  13 Jun 2020 7:59 AM GMT
ఏపీలో 17 మంది ఐపీఎస్‌ల బదిలీలు

ఏపీలో ప్రభుత్వ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తనదైన శైలిలో ముందుకు సాగుతున్న జగన్‌ సర్కార్‌ .. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే ఒక్కొక్క శాఖలో అధికారులను బదిలీలు చేస్తోంది ప్రభుత్వం. తాజాగా 17 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 1. రైల్వేశాఖ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
 2. విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీనివాస్‌
 3. ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్‌. సుబ్రమణ్యం
 4. రోడ్‌ సేఫ్టీ ఏడీజీగా కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా
 5. ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా రామకృష్ణ
 6. శ్రీకాకుళం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌
 7. గుంటూరు ఎస్పీగా విశాల్‌గున్నీ
 8. డీజీపీ కార్యాలయ అడ్మిన్‌ ఏఐజీగా బి.ఉదయ్‌ భాస్కర్‌
 9. విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి
 10. ఎస్‌ఐబీ ఎస్పీగా అట్టాడా బాబుజీ
 11. గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఆర్‌ఎన్‌. అమ్మిరెడ్డి
 12. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా నారాయణ నాయక్‌
 13. విశాఖ ఎస్పీగా కృష్ణారావు
 14. విజయవాడ రైల్వే ఎస్పీగా సిహెచ్‌.విజయరావు
 15. సీఐడీ ఎస్పీగా నవదీప్‌ సింగ్‌
 16. డీజీపీ కార్యాలయ నిపోర్టు చేయాల్సిందిగా ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
 17. దిశ ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికను డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story
Share it