ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ
By Newsmeter.Network Published on 5 Dec 2019 8:58 AM ISTఏపీలో ఆరుగురు ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. జైళ్ల శాఖ డీజీగా మహమ్మద్ రేజా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ టీ.ఏ త్రిపాఠి, ఏసీబీ డీజీగా కుమార్ విశ్వజిత్‌లు కొనసాగనున్నారు. అలాగే నెల్లూరు ఎస్పీ గా పని చేస్తున్నఐశ్వర్యరస్తోగీని డీజీపీ కార్యాలయంలో పరిపాలన ఏఐజీగా బదిలీ చేశారు. ఇక నెల్లూరు ఎస్పీగా భాస్కర్ భూషణ్, అలాగే ఖాళీగా ఉన్న ఇంటలిజెన్స్ ఐజీ స్థానంలో మనీష్ కుమార్ సిన్హాను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story