ఏపీ ఇంటర్ ఫలితాలు రేపే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Jun 2020 6:21 PM ISTఅమరావతి : ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ రేపు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం.
కరోనా విజృంభణ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమైంది. అయితే, ఇటీవల ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో మూల్యాంకనాన్ని పూర్తి చేసిన ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను ఎట్టకేలకు రేపు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మార్చి 4 నుంచి 23 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
Next Story