ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 9:18 AM GMT
ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్

అమరావతి: అక్టోబర్ 2 దగ్గర పడుతుండటంతో గ్రామ పంచాయతీ ఉద్యోగుల మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌ లో పెట్టారు. జిల్లాలు వారిగా మెరిట్ జాబితా పెట్టినట్లు పంచాయతీ రాజ్ కమిషనర్‌ గిరిజా శంకర్‌ వెల్లడించారు. మెరిట్ లిస్ట్‌లో అభ్యర్ధులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఎంపికైన అభ్యర్ధులు ఆన్‌ లైన్‌లో కాల్ లెటర్లు డౌన్‌ లోడ్ చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్ లెటర్లు అభ్యర్ధులు తీసుకురావాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయ రాత పరీక్షల అనంతరం 1,26,728 అభ్యర్ధుల నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. పలు కారణాలతో సమయానికి వెరిఫికేషన్‌కు హాజరు కాకపోతే మరో అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఎంపికైన అభ్యర్దులకు 29లోపు నియామక పత్రాలు అందజేస్తారు. మొదటి రెండు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. అక్టోబర్‌ 2న విధుల్లో చేరిన అనంతరం రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అక్టోబర్‌ 14 నవంబర్‌ 15 మధ్య ఈ శిక్షణ కార్యక్రమం ఉండే అవకాశముంది. ఇక..మహిళలకు 33శాతం కోట ఉండేలా అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

వెరిఫికేషన్ సమయంలో అభ్యర్ధుల వెంట ఉండాల్సిన సర్టిఫికెట్లు

1. అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం డౌన్‌లోడ్‌ చేసుకున్న పేపర్‌

2.ఎస్‌ఎస్‌సి సర్టిఫికెట్

3. ఒరిజినల్ మార్కుల లిస్ట్‌లు

4.4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు

5.స్థానికత మార్చుకుంటే సంబంధిత సర్టిఫికెట్

6. దివ్యాంగులైతే వారి తల్లిదండ్రుల నివాసిత ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికెట్

7.బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్దులైతే కుల ధృవీకరణ పత్రం

8.బీసీ అభ్యర్ధులకు నాన్‌ క్రిమిలేయర్ సర్టిఫికెట్

9.ఎన్‌సీసీ, క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లు

10. అవుట్ సోర్సింగ్‌లో ఉన్న వారు ఇన్ సర్వీస్ సర్టిఫికెట్

11.క్రిమినల్ కేసులు లేవనే సెల్ఫ్ సర్టిఫికెట్

Next Story
Share it