మీడియాపై ఆంక్షలు ఎందుకు పెట్టామంటే..? అందుకే: ఏపీ ప్రభుత్వ  మీడియా సలహాదారు అమర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 12:54 PM GMT
మీడియాపై ఆంక్షలు ఎందుకు పెట్టామంటే..? అందుకే: ఏపీ ప్రభుత్వ  మీడియా సలహాదారు అమర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక జీఓ విడుదల చేసింది.ప్రభుత్వం పైన నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచారం చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని జీఓ లో స్పష్టం చేశారు. మీడియా పై ఆంక్షలు, లక్ష్మణ రేఖ ఉండాల్సిన అవసరం ఉందా అని అంశంపై గతంలోనే చర్చలు జరిగాయి.జాతీయ మీడియా ప్రముఖులు, సంపాదకులు అనేకమందితో 2005 లో జరిగిన సదస్సు లో మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని పేర్కొన్నారు.పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగం లో ఎక్కడా పొందుపరచలేదు.కాని.. ఎన్నో ఏళ్లుగా మీడియా కు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారు.వ్యక్తి కి గాని, సంస్థకు గాని, నష్టం కలిగేలా, బురదచల్లే ప్రయత్నాలు ఏ మీడియా కూడా చేయకూడదు.అలా ఎవరైనా చేస్తే..న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం కొత్త జీఓ ను తీసుకొచ్చింది.ఎవరైనా అసత్య వార్త రాస్తే...అది నిరాధారమైన వార్త అని..ఆధారాలతో ఏ సంస్థ ఐనా, ప్రభుత్వమైనా ఖండన వార్తను ఇస్తే పత్రికలు ప్రచురించాల్సి ఉంటుంది.కాని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి పత్రికల్లో, మీడియా లో లేదు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ జీఓ పై కొందరు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. కాని.. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయమైతే కాదు.ఈ జీఓ వలన అసత్యాలను, నిరాధారమైన వార్తలు రాసే వారే భయపడుతున్నట్లు వున్నారు.నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టు భయపడాల్సిన అవసరం లేదు.ఒక వేళ రాసిన వార్త నిజమైతే..కోర్ట్ ద్వారా న్యాయపరమైన రక్షణ పొందవచ్చు



Next Story