10 మంది ఖైదీల‌కు ఏపీ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 6:56 AM GMT
10 మంది ఖైదీల‌కు ఏపీ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష

అమ‌రావ‌తి: భార‌త జాతిపిత మ‌హాత్మా గాంధీ 150 వ జ‌యంతి ఉత్స‌వాలు దేశ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వివిధ జైళ్ల‌లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది సత్ప్రవర్తన కల్గిన ఖైదీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలు నుంచి న‌లుగురికి, విశాఖ సెంట్ర‌ల్ జైలు నుంచి ఇద్ద‌రికి, విజ‌య‌వాడ‌, అనంత‌పురం, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల జైళ్ల నుంచి ఒక్కొక్క‌రికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది. ఈ మేర‌కు హోంశాఖ కార్య‌ద‌ర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్త‌ర్వులిచ్చారు.

Next Story
Share it