అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బతికించడానికి సీఎం జగన్ ‘వైఎస్ఆర్ నవోదయ’ పూథకాన్ని ప్రారంభించారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని తన కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీ షెడ్యూల్ చేయనున్నారు. రుణ ఒత్తిడిని నుంచి పారిశ్రామిక వేత్తలను గట్టెక్కించుదుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం..9 నెలల్లో బ్యాంకులకు రుణాలు రీ షెడ్యూల్ చేయనున్నారు. మార్చి31, 2020 నాటికి ఎంఎస్‌ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం కోరింది. అయితే..రిజర్వ్ బ్యాంక్‌ నిబంధనలు ప్రకారం..రూ.25 కోట్లు మించి ఉండకూడదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.