అమరావతి: వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. హిందూ దేవాలయాల్లో హిందూవులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. జీవో కూడా విడుదల చేసింది.

Image result for hindu temples

హిందూవులు కాని వారికి ఎట్టిపరిస్థితుల్లో దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వొద్దని జీవోలో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని జీవోలో చెప్పారు.

Image result for hindu templesఅంతేకాదు..హిందూదేవాలయాల్లో పని చేస్తున్నవారిని వేరే శాఖల్లోకి మార్చాలని స్పష్టం చేశారు. హిందూవులు కానివారు దేవాలయాల్లో పని చేస్తుంటే..విజిలెన్స్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ఉద్యోగుల ఇళ్లల్లో జరిగే పండుగలు , పెళ్లిళ్లు వీడియో తీసి విజిలెన్స్‌కు ఇస్తే..వాస్తవాలు పరిగణనలోకి తీసుకుని విజిలెన్స్ చర్యలు తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.

Image result for hindu temples

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.