జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ ఉద్యోగులకు సిఫ్ట్‌ల వారిగా విధులు

By Newsmeter.Network  Published on  22 March 2020 8:14 AM GMT
జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ ఉద్యోగులకు సిఫ్ట్‌ల వారిగా విధులు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్‌లోనూ ఈ వైరస్‌ ప్రభావం రోజురోజుకు విస్తరిసోంది. రోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్‌ విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు.. వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కానీ ఏపీతో పోల్చితే తెలంగాణలో వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటికే 21 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రాగా.. అనేక మంది అనుమానితులు ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. పలువురు అనుమానితులు ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్సలు పొందుతున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరగకుండా ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా సాగుతుంది.

ఏపీలో కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగు విజ్ఞప్తి మేరకు ఉద్యోగులకు సిఫ్ట్ల వారీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా సదుపాయం కల్పించింది. అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతుంటంతో ఏపీ సచివాల ఉద్యోగులు తమకు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీలు సోమవారం నుంచి రెండు బ్యాచ్‌లుగా విడిపోయి ఉదోగ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఒక బ్యాచ్‌ ఇంటి నుండి పనిచేస్తే.. మరో బ్యాచ్‌ సచివాలయ కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తారు. ఇలా వారినికో బ్యాచ్‌ విడతల వారీగా పనిచేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇటు సచివాలయ లోపలికి ఉదోగుల మినహా ఎవరిని అనుమతించడం లేదు.

ఇదిలాఉంటే సెక్రటేరియట్‌ ఉద్యోగులు అందరూ ఒకేసారి విధులకు రాకుండా వేర్వేరు సమయాల్లో వచ్చేలా చేస్తున్నారు. ఒక వారంలో విధులకు వచ్చే ఉద్యోగుల్ని మూడు టీములుగా చేస్తారు. ఒక టీం మార్నింగ్‌ 9.30 గంటలకు, రెండవ టీం 10గంటలకు, మూడో టీం 10.30 గంటలకు ఆఫీసు వస్తారు. ఎవరు ఏటీంలో రావాలో సెక్షన్‌ ఆఫీసర్లు డిసైడ్‌ చేసుకోవచ్చు. జిల్లా ఆఫీసుల్లో గెజిటెడ్‌ అధికారులు, అంతకుపై స్థాయి అధికారులు రోజూ ఆఫీసులకు రావాల్సిందే. కింది స్థాయి ఉద్యోగులకు వంతుల వారీ విధానం ఉంటుంది. డివిజన్‌, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పరిస్థితుల్ని బట్టి ఉద్యోగులకు వంతుల వారీగా పనులు ఇస్తారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావంతో వర్క్‌ ఫ్రం హోం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. పలు ప్రైవేట్‌ సంస్థలు, కార్యాలయాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం చేసే వారికి అంతరాయం లేకుండా ఇంటర్‌ నెట్‌ సదుపాయం ప్రభుత్వం కల్పించింది. ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా 24గంటల ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని కల్పించాలనిమ మంత్రి గౌతమ్‌ రెడ్డి టెలికాం, ఇంటర్‌ నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచుకొని ఎలాంటి సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి వారికి సూచించారు.

Next Story