ఏపీ హైకోర్టు రోస్టర్ విధానంలో కీలక మార్పులు
By సుభాష్ Published on 2 Nov 2020 9:45 AM GMTఏపీ హైకోర్టు రోస్టర్ విధానంలో కీలక మార్పులు చేశారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని హైకో్రటు చఫ్ జస్టిస్ కార్యాలయం వెల్లడించింది. రాజధాని వివాదంపై దాఖలైన కేసులన్నింటినీ ఒక ధర్మాసనానికి అప్పగించారు. అయితే ఈ ధర్మాసనంలో తాజాగా కొన్ని మార్పులు చేశారు.
రోస్టర్ విధానంలో చేసిన కీలక మార్పుల్లో భాగంగా రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్ రాకేష్ కుమార్,జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అన్ని బెయిల్ పిటిషన్‌లపై విచారణ జరిపే బాధ్యతలను జస్టిస్ కన్నెగంటి లలితకు అప్పగించారు. అలాగే రెవెన్యూ, భూ సేకరణ కేసులను జస్టిస్ రమేష్ కుమార్‌కు కేటాయించారు. ఇక రోస్టర్ విధానంలో మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి కార్యాలయం తెలిపింది.