ఏపీలో మరో 33 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 May 2020 3:39 PM ISTఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,638 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 33 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2874 కి చేరింది. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరణాల సంఖ్య 60కి చేరింది.
మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2037 మంది డిశ్చార్జి కాగా.. 777 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 245 మంది కరోనా బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story