అసెంబ్లీ సమావేశాలు: రచ్చకు వేళయేరా..!
By సుభాష్ Published on 16 Jun 2020 9:43 AM ISTఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా గవర్నర్ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించనున్నారు. ఇక ఈ కీలకమైన సమావేశాలకు ముందు అధికార పార్టీ వైసీపీ, టీడీపీని పూర్తిగా సైడ్ ట్రాక్ చేసే ప్లాన్ చేసిందా..?అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటికి అందిస్తున్న నిధులు,ఆర్థిక పరిస్థితులు, ఇసుక సమస్య, రాజధాని తరలింపు తదితర అంశాలు సమావేశం ముందుకు రానున్నాయి.
అధికార పక్షం ప్లాన్ ఇదేనా..?
అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిల అరెస్టుల వ్యవహారాలతో ప్రతిపక్షాన్ని పక్కదారి నెట్టేందుకు అధికార పక్షం ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే అచ్చెన్నాయుడు, జేసీల వ్యవహారం సభలో గళం విప్పకపోతే ప్రతిపక్షపార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారాల కారణంగా సభలో పెద్దగా ఒరిగేది ఏమి లేకున్నా.. సమస్యలపై, ఇతరాత్ర సమస్యలపై ఏదో విధంగా సభలో రచ్చ రచ్చ చేయాలన్నదే టీడీపీ ప్లాన్. ఇక ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు అధికారపార్టీ సైతం ముందు నుంచి సిద్ధం అయ్యింది.
నల్ల చొక్కాలతో సమావేశాలకు..
కాగా, ఈ సమావేశాలకు నల్లచొక్కాలతో సమావేశాలకు వచ్చి నిరసన తెలియజేయాలని టీడీపీ నిర్ణయించింది. ప్రతిసారి జరిగే సమావేశాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప.. ప్రజాహితమే పరమావధిగా సాగడం లేదన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతోంది. అయినా పంతాలు, పట్టుదలలలకే అధికార పక్షాలు ముందుకు సాగడం విచారకరమణి రాజకీయ నేతలు అంటున్నమాట. ఇందుకు తోడు రెండు ప్రధాన పార్టీలు ఈ సమావేశాలకు ముందు రచ్చకు వ్యహాలు రచించుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. రెండు రోజులుగా సాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రజా సమస్యలపై ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా..?లేక ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే సమావేశాలు ముగిస్తాయా.. అనేది వేచి చూడాలి.