ఒకరికి మూడు మద్యం బాటిల్లు మాత్రమే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 6:19 AM GMT
ఒకరికి మూడు మద్యం బాటిల్లు మాత్రమే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!!

ఏపీ ప్రభుత్వం మద్యపాన నిషాదం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా, ఏపి సిఎం జగన్ కొత్త పాలసీ ని తీసుకువచ్చారు. మద్యం బాటిళ్ల పరిమితిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో వ్యక్తి వద్ద లిక్కర్ బాటిల్స్ అయితే 3, బీర్ బాటిల్స్ అయితే 6 కంటే మించి ఉండవద్దని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

సెప్టెంబర్ 1 నుండి నూతన మద్యం పాలసీలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా సెప్టెంబర్ ఒకటి నుండి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పర్మిట్ గదులను కూడ ప్రభుత్వం రద్దు చేసింది. ఎమ్మార్పీ రేట్లకే మద్యం,రాత్రి 9గంటల వరకే మద్యం విక్రయాలు వంటి నిబంధనలు తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Next Story