బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల అవస్థలు..

By అంజి  Published on  30 March 2020 4:34 PM GMT
బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల అవస్థలు..

లండన్‌: బ్రిటన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు వద్ద తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. 10 రోజుల క్రితం భారత్‌కు వచ్చేందుకు 70 మంది విద్యార్థులు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కానీ విమనా సర్వీసులు లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. మొదటి నాలుగు రోజులు ఇండియన్‌ ఎంబసీ అధికారులు వసతి, ఆహారం అందజేశారు.

AP and TS students Struct in Uk

గత ఐదు రోజులుగా ఆహారం, వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్రంలోని ఎంపీలకు ఫోన్లు చేసి విద్యార్థులు విలపిస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నామని వాపోతున్నారు. వెనక్కు వెళ్లడానికి వీలులేక, ఎయిర్‌పోర్టు లోపలికి రానివ్వక ఇబ్బందులు పడుతూ విద్యార్థులు రోడ్లపైనే గడుపుతున్నారు. తమకు కనీసం షెల్టర్‌ ఇపించాలని విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

4

Next Story