ఏపీలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా.. 24 గంటల్లో 50 కరోనా కేసులు
By సుభాష్ Published on 10 May 2020 11:52 AM ISTఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా ఆదివారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 1980 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 925 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య 45 కి చేరగా, ప్రస్తుతం 1010 మందికి కరోనాతో చికిత్స పొందుతున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో 8,666 మంది కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, 50 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
గడిచిన 24 గంటల్లో 38 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కర్నూలు నుంచి 21, గంటూరు నుంచి 8 మంది, కృష్ణా నుంచి 3, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2, విశాఖ నుంచి 2, నెల్లూరు నుంచి ఒక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు.
ఇక రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు.. కర్నూలు 13, గుంటూరు 6, నెల్లూరు 5, అనంతపురం 5, ప్రకాశం 2, విశాఖ 1, కృష్ణా 1, కడప జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి.