బిగ్‌బ్రేకింగ్: ఏపీలో టెన్త్ పరీక్షలు..ఎప్పటి నుంచి అంటే..
By సుభాష్ Published on 14 May 2020 5:56 PM ISTఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూసివేసిన ప్రభుత్వం, పదో తరగతి పరీక్షలను సైతం వాయిదా వేసింది. అయితే టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండేది. ఎంతగానో ఎదురు చూసిన విద్యార్థులకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ వినిపించింది ఏపీ సర్కార్. పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది. జులై 10వ తేదీ నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతీ పేపర్‌కు వంద మార్కులు ఉంటాయని, 11 పేపర్లను 6 పేపర్లకు కుదించినట్లు తెలిపింది. ఇక పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడతామని అధికారుల వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.
కాగా, లాక్‌డౌన్ కారణంగా దేశంలో విద్యార్థులకు పరీక్షలను వాయిదా పడ్డాయి. విద్యాసంస్థలు కూడా మూసివేసింది. కరోనా కట్టడిలో భాగంగా ముందు జాగ్రత్తగా విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా 1 నుంచి 1వ తరగతి వరకూ ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.