మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అంటారు. కానీ..చాలా మంది తమలా ఉన్న వారిని కలుసుకోలేరు. అసలు తమలా ఉన్నవారు ఎక్కడుక్కడున్నారో కూడా తెలుసుకునే ఆలోచనే తమ మెదడులోకి రానివ్వరు. కానీ..బాలీవుడ్ నటి అనుష్క శర్మ మాత్రం ఏ మాత్రం కష్టపడకుండానే తనలా ఉన్న మరో అమ్మాయిని కనిపెట్టేసింది. ఆమెవరో కాదు.. అమెరికాలో పేరు గడించిన సింగర్ జూలియా మైఖేల్. గతేడాది జూలియా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక సెల్ఫీ ఇప్పటికి కూడా అనుష్క శర్మనే తలపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ నిజంగా అనుష్క శర్మే అనుకున్నారు.

నాలుగు రోజుల క్రితం జూలియా ఒక సెల్ఫీని పోస్ట్ చేసింది. ఆ సెల్ఫీ కింద సాధారణంగా తన జుట్టుకు రంగు వేసుకుని..పైకి పెట్టుకోనని తెలిపింది. కానీ ఈసారి అన్ని రకాల ఫన్ మ్యూజిక్ చేయాల్సి రావడంతో ఇలా చేయకతప్పలేదని, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానని పేర్కొంది.

అలా ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు “I thought this was @anushkasharma.”అని కామెంట్ చేయడంతో ఆమె షాక్ అయింది. ఆ ఒక్క ఫొటోకే కాదు. అన్ని ఫొటోలకు ఇదే రకమైన కామెంట్లు రావడంతో..తాను అనుష్క శర్మ ఒకేలా ఉన్నామని గుర్తించింది జూలియా. వెంటనే..తన ఫొటో, అనుష్క ఫొటోను కలిపి.. “హాయ్ అనుష్క శర్మ..అనుకోకుండా మనిద్దరం ట్విన్స్ అని రాసి..అనుష్క శర్మను టాగ్ చేసింది.

ఇది చూసిన అనుష్క శర్మ..చాలా సంబరపడిపోయింది. ఓ మై గాడ్ నిజమే నంటూ ఎగిరి గంతేసినంత పనిచేసింది. నా జీవితంలో నాలా ఉన్న నిన్ను చూశాను..మిగతా ఐదుగురు ఎక్కడున్నారో అంటూ ట్వీట్ చేసింది. అనుష్క శర్మ చేసిన ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

అనుష్క శర్మ, జూలియా ఇంచుమించు ఒకేలా ఉన్నారు. జూలియా కళ్లు కాస్త చిన్నవి..ఆమె జుట్టు రంగు తప్ప ముఖ చిత్రం..ముక్కు, పెదాలు అన్నీ అచ్చుగుద్దినట్లే ఉండటంతో..వీరిద్దరినీ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

గతేడాది ఓ వ్యక్తి విరాట్ కోహ్లీలా ఉండటంతో బాగా పాపులర్ అయిపోయాడు. ట్విట్టర్ ద్వారా అతను ప్రపంచానికి పరిచయమయ్యాడు. విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది విరాట్ కోహ్లీలా ఉన్న వ్యక్తిని చూసిన ఫ్యాన్స్ అవాక్కయ్యారు. అతనెక్కడే దేశాలవతల కూడా కాదు ఉన్నది. మన దేశంలోనే..

ఏదేమైనా ఈ విరుష్క జంట ను పోలి ఉన్న వ్యక్తులు వీరి జీవితంలో తారసపడటం అదృష్టమే కదా.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.