అనుష్క 'నిశ్శబ్ధం' ఎంత వరకు వచ్చింది.? రిలీజ్ ఎప్పుడు..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sep 2019 1:26 PM GMT
అందం, అభినయం... ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో అనుష్క ఒకరు. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగవతి... ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన అనుష్క తాజా చిత్రం నిశ్శబ్ధం. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
ఇటీవల రిలీజ్ చేసిన నిశ్శబ్ధం ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం దాదాపు విదేశాల్లోనే జరిగింది. ఈ సినిమాలో ఆమె మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. ఓ కీలకమైన పాత్రలో మాధవన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ కనిపించనున్నాడు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ వర్క్ జరుపుకుంటోంది.
దసరా పండుగకి ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుష్క ఈ మూవీ ఖచ్చితం విజయం సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. త్వరలోనే విడుదల తేదీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.