అనుష్క 'నిశ్శ‌బ్ధం' రిలీజ్ డేట్ ఫిక్స్

By Newsmeter.Network  Published on  2 Dec 2019 11:45 AM GMT
అనుష్క నిశ్శ‌బ్ధం రిలీజ్ డేట్ ఫిక్స్

బాహుబ‌లి త‌ర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ... క‌థా బలం ఉన్న సినిమాల‌నే ఎంచుకుంటూ.. కెరీర్ లో దూసుకెళ్తున్న బెంగుళూరు భామ అనుష్క‌. అయితే భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత అనుష్క న‌టించిన తాజా చిత్రం 'నిశ్శ‌బ్ధం'. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.

'నిశ్శ‌బ్ధం' ఫ‌స్ట్ లుక్ కి మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం దాదాపు విదేశాల్లోనే జరిగింది. ఇలా షూటింగ్ మొత్తం అమెరికాలో జ‌రుపుకున్న ఫ‌స్ట్ మూవీ ఇదే అని ర‌చ‌యిత కోన వెంక‌ట్ తెలియ‌చేశారు. ఈ సినిమాలో అనుష్క‌ మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.

ఓ కీలకమైన పాత్రలో మాధవన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ కనిపించనున్నాడు. ఈ రోజు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేశారు. తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Next Story