జయరామ్ హత్య కేసులో మరో మలుపు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 10:10 AM GMTపారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసులో కొంత మంది పోలీసులపై నాంపల్లి కోర్టులో ట్రయల్ ప్రారంభమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ జనవరి 30న హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి గా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు.. మరో ముగ్గురు పోలీసు అధికారులకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా నాంపల్లి కోర్టు గుర్తించింది. వీరిలో రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిల పేర్లను పోలీసులు చార్జిషీట్‌లో చేర్చి సస్పెండ్ చేసింది.
అయితే శాఖాపరమైన విచారణ నలిపివేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నిరాకరించింది. కాగా..పోలీస్ అధికారులు విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో..వీరికున్న సంబంధాలపై కోర్టు ఆరా తీయనుంది. కాగా.. మరో రెండు నెలల్లో జయరామ్ హత్య కేసులో పూర్తి వివరాలతో.. నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.