తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ఆగడంలేదు. ఉద్యోగం పోయిందన్న తీవ్ర మనస్తాపంతో సత్తుపల్లి డిపో డ్రైవర్‌ ఎస్‌కె. ఖాజా మియా గుండెపోటుతో మృతి చెందాడు. సెప్టెంబర్‌ నెల జీతం రాకపోవడంతో ఖాజా మియా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎస్‌కె ఖాజా మియా ఐడి నెంబర్‌ E No306644. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజలు మండిపడుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ అన్ని డిపోల ముందు ప్లకార్డులతో నిరసన తెలపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపిన విషయం తెలిసిందే. సమ్మెను ఉధృతం చేసేందుకు కార్మిక నేతలు నిర్ణయించారు. ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.