బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ మరో రూ.2 కోట్ల విరాళం

By సుభాష్  Published on  28 April 2020 7:18 AM GMT
బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ మరో రూ.2 కోట్ల విరాళం

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి మనసున్న మహరాజులు చాలా తక్కువ. కష్టకాలంలో అండగా ఉండే అక్షయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎవరు చేయని విధంగా ఆర్థిక సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు రియల్‌ హీరో అక్షయ్‌. తాజాగా లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్‌ ఫౌండేషన్‌కు రూ. 2 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని ముంబై పోలీస్‌ కమీషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అక్షయ్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే అంతకు ముందు ఈ విషయంపై అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌, సందీప్‌ సర్వ్‌లకు నివాళులు అర్పించారు. అలాగే పోలీస్‌ ఫౌండేషన్‌కు ఫ్యాన్స్‌ విరాళం ఇవ్వాలని కోరారు.

కాగా, ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సహాయనిధికి రూ.25 కోట్లు, ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు రూ.3 కోట్ల విరాళం అందించారు.Next Story