అమ్మో బెడ్‌రూమా..? ఓపిక లేదు.. వదిలేయండి

By Newsmeter.Network  Published on  29 Feb 2020 7:06 AM GMT
అమ్మో బెడ్‌రూమా..? ఓపిక లేదు.. వదిలేయండి

సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే చాలా కష్టం. అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చేయడానికి సిద్దం అవుతున్నారు నేటి కథానాయికలు. అందాలు ప్రదర్శించడానికి సైతం సిద్దమంటున్నారు. ముందు అందాల విందు చేసి ఆ తరువాత నటనా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. అనుష్క, నయనతారా వంటి అగ్రకథానాయికలు ఈ కోవకే చెందుతారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం బోల్డ్‌ సీన్లకే పరిమితమవుతున్నారు.

ఒక చిత్రంలో బోల్డ్‌గా నటిస్తే తరువాత అలాంటి పాత్రలే వస్తుంటాయి. దీంతో ఆ సీన్లను ఎందుకు చేశారా బాబూ.. నాలో ఉన్ననటిని గుర్తించరా.. అని బాధపడుతుంటారు. అలాంటివారిలో ఒకరు ప్రముఖ తమిళ నటి ఆండ్రియా జెరీమియా. యుగానికి ఒక్కడు, విశ్వరూపం-2 సినిమాల్లో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించింది అమ్మడు. వడా చెన్నై’ సినిమాలో అయితే.. బెడ్‌రూం సీన్లకే పరిమితమైపోయింది అమ్మడి పాత్ర.

ఇక ఈ సీన్లతో విసిగిపోయానని అంటున్నారు ఆండ్రియా. తనకు చాలాకాలంగా ఇలాంటి సన్నివేశాలే వస్తున్నాయని, ఇక తన వల్ల కాదని చెప్పారు. తన పాత్ర గొప్పగా ఉండి, బెడ్ రూం సీన్లలో నటించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను కానీ, ఊరికే బోల్డ్ సీన్లలో నటించమంటే మాత్రం ఇక నుంచి నో చెబుతానని అంటున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పింది అమ్మడు. ఆండ్రియా ప్రస్తుతం ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో సినిమా రిలీజ్ కాబోతోంది.

Next Story
Share it