సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌పై వైసీపీ వివరణ
విజయవాడలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వెళ్లింది.
By Srikanth Gundamalla
సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌పై వైసీపీ వివరణ
విజయవాడలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వెళ్లింది. ఎలాంటి తనిఖీలు లేకుండా క్యాంపు కార్యాలయంలోకి రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు ఆరోపణలు చేశారు. కంటైనర్‌లో ఎన్నికల కోసం నగదు తరలిస్తున్నారనీ.. అందుకే దాన్ని పోలీసులు కూడా చెక్ చేయలేదని అన్నారు. ఎవరికీ తెలియకుండా సీఎం క్యాంపు కార్యాలయంలోకి తరలించారని నారా లోకేశ్ ఆరోపించారు. లేదంటే బ్రిజిల్ సరుకా? మద్యంలో మెక్కిన వేలకోట్లా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే.. టీడీపీ ఆరోపణలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చిన్న విషాన్ని రాద్దాంతం చేస్తున్నారంటూ టీడీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నాయకులకు ఏ కంటైనర్ చూసినా డ్రగ్స్ కంటైనరరే గుర్తుకు వస్తుందని విమర్శించారు. అయితే.. విశాఖ నదీ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో టీడీపీ నేతల బంధువులే ఉన్నారని చెప్పారు. అయితే.. సీఎం క్యాంపు కార్యాలయంలోకి తరలించిన ట్రక్కులో ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ మాత్రమే ఉందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అవగాహన లేని ఆరోపణలను మానుకోవాలని ఆయన సూచించారు.
ఇదే విషయంపై వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో స్పందించింది. సోషల్ మీడియా వేదికగా మరో రకంగా వివరణ ఇచ్చింది. సీఎం జగన్ ఆఫీసులోకి ప్రవేశించిన వాహనం పాంట్రీ వాహనం అని తెలిపింది. ఈ మేరకు వైసీపీ ఎక్స్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేసింది. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా దారిలో ఆహారం తయారు చేసే పాంట్రీ వాహనం అని వైసీపీ వివరించింది. దీనిపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని తెలిపింది వైసీపీ. ఇక నెటిజన్లు మాత్రం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
సీఎం @ysjagan బస్సుయాత్ర సందర్భంగా దారిలో ఆహారాన్ని తయారు చేసుకునే పాంట్రీ వాహనం.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తే.. ఆ వాహనంపై రామోజీ పచ్చ మీడియాలో దుష్ప్రచారం.#BanYellowMediaSaveAP pic.twitter.com/K3O0nRm1YM
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024