వైసీపీలో పంచాయితీ, మంత్రిపై జగన్‌కు ఫిర్యాదు చేసిన పిల్లి సుభాష్
అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ నాయకుల పంచాయితీ తాడేపల్లికి చేరింది.
By Srikanth Gundamalla Published on 18 July 2023 11:10 AM GMTవైసీపీలో పంచాయితీ, మంత్రిపై జగన్‌కు ఫిర్యాదు చేసిన పిల్లి సుభాష్
అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ నాయకుల పంచాయితీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్ని విషయం తెలిసిందే. ఇరు వర్గాలవారు తీవ్ర ఆరోపణలు, దాడులు కూడా జరిగాయి. వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే సీఎం కార్యాలయం నుంచి పిల్లి సుభాష్‌కు పిలుపు వెళ్లింది. దాంతో.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుపై ఫిర్యాదు చేశారు.
రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. వేణు తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి అయ్యారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి వేణుతో బోస్‌కి మధ్య విభేదాలు పెరిగాయి. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు ఈ సారి టికెట్ ఇవ్వాలని పిల్లి సుభాష్ వర్గీయుల పట్టుపడుతున్నారు. ఈ నెల 16న పిల్లి సుభాష్ తన అనుచర వర్గంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి వేణుకు రామచంద్రాపురం టికెట్ ఇస్తే ఓడించి తీరతామని పిల్లి సుభాష్ వర్గం స్పష్టం చేసింది. మంత్రి వేణు ప్రణాళిక ప్రకారమే శెట్టి బలిజలను తొక్కేస్తున్నారని ఎంపీ పిల్లా సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీ, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే.
సూర్యప్రకాశ్‌కు టికెట్ ఇవ్వాలని సభాష్ కోరుకుతున్నారు. ఈ నెల 26న సీఎం జగన్ అమలాపురం వెళ్లనున్న సందర్భంగా తీర్మానం కూడా అందజేయాలని నిర్ణయించారు. మంత్రి వేణు మాత్రం రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఈసారి కూడా తీనే అంటూప్రకటించారు. ఈక్రమంలోనే ఎంపీ పిల్లి సుభాష్‌తో సీఎం జగన్ చర్చలు జరిపారు. మరి ఇరువర్గాలకు జగన్ ఏం చెప్తారు? ఎలా గొడవను సద్దుమణిగిస్తారో చూడాలి.