పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడలో వరదలు: బొత్స
విజయవాడలో వరదలు సంభవించడంపై మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 5:16 PM ISTఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వరదలు పెద్ద ఎత్తున సంభవించాయి. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఎంతో మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడలో పరిస్థితులు దయనీయంగా కనిపించాయి. తాజాగా విజయవాడలో వరదలు సంభవించడంపై మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడలో వదరలు వచ్చాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. భారీ వర్షాలు కురుస్తాయనీ.. ఫలితంగా వరదలు వస్తాయని అధికారులు ముందే చెప్పినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
విజయవడ వదర బాధితులకు వైసీపీ ఆధ్వర్యంలో సహాయార్థం నిత్యావసర సరుకుల వాహనాలను బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం అసలు ఆలోచనే చేయడం లేదన్నారు. వైసీపీ మాత్రమే విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని చెప్పారు. ప్రతి ఆరోపణల వెనుక గత ప్రభుత్వమే కారణమంటూ తాము చేయాల్సిన పనుల నుంచి తప్పించుకుంటున్నారని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారని బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించామనీ.. అందువల విజయవాడకు పెను మప్పు తప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు సత్వరమే సహాయం అందించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.