ఫలితాలపై నా అంచనా తప్పైంది: జ్యోతిష్యుడు వేణుస్వామి

ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రమే కాదు.. కొందరు జ్యోతిష్యులు కూడా అంచనా వేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 3:30 PM IST
venu swamy,   wrong prediction, ap results,

ఫలితాలపై నా అంచనా తప్పైంది: జ్యోతిష్యుడు వేణుస్వామి

ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రమే కాదు.. కొందరు జ్యోతిష్యులు కూడా అంచనా వేస్తుంటారు. గ్రహాల బలాలు.. జాతకాలను బట్టి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్నది చెబుతుంటారు. అయితే.. ఇటీవల కేంద్రం, ఏపీలో ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంచనా చెప్పాడు. తాజాగా. తన జోస్యంపై స్పందించాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు. ఏపీ విషయంలో తాను అనుకున్న లెక్క తప్పిందని అన్నాడు. కానీ తాను చెప్పిన దాంట్లో రెండింటిలో ఒకటి నిజమైందని పేర్కొన్నాడు జ్యోతిష్యుడు వేణుస్వామి.

ఈ మేరకు వీడియోలో మాట్లాడిన వేణుస్వామి.. దేశం, రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై అంచనా ప్రకారం చెప్పానని అన్నారు. దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. అది జరిగిందన్నారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌రెడ్డి గెలుస్తారని భావించాననీ.. ఈ విషయంలో తన లెక్క తప్పిందన్నారు వేణుస్వామి. తనకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానన్నారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పానని అన్నారు. ఏపీ విషయంలో తాను చెప్పింది వందశాతం తప్పని అంగీరిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు జ్యోతిష్యుడు వేణుస్వామి.

కాగా.. ఇటీవల వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడిన వేణుస్వామి జగన్‌ మోహన్‌రెడ్డి మరోసారి సీఎం అవుతారని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత కూడా వాటిని తప్పు బడుతూ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా వెలువడుతున్న ఫలితాలతో స్పందించిన జ్యోతిష్యుడు వేణుస్వామి తాను చెప్పింది తప్పు అని ఒప్పుకున్నాడు.

Next Story