క్లాస్‌రూంనే క‌ళ్యాణ‌మండ‌పంగా చేసి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మైనర్లు

Two students studying Intermediate got married I క్లాస్‌రూంనే క‌ళ్యాణ‌మండ‌పంగా చేసి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మైనర్లు

By సుభాష్  Published on  3 Dec 2020 6:56 AM GMT
క్లాస్‌రూంనే క‌ళ్యాణ‌మండ‌పంగా చేసి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మైనర్లు

ఇంట‌ర్ చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థులు ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాల‌ని అనుకున్నారు. క్లాస్‌రూంనే క‌ళ్యాణ‌మండ‌పంగా మార్చేశారు. అమ్మాయి మెడ‌లో ఆ అబ్బాయి ప‌సుపు కొమ్ముతో చేసిన తాళి క‌ట్టేశాడు. అయితే.. వారిద్ద‌రూ మైన‌ర్లు. ఈ విష‌యం తెలిసిన క‌ళాశాల ప్రిన్సిపాల్ వారిద్ద‌రికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించి వేశాడు. ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌మండ్రి ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దువుతున్న ఓ మైన‌ర్ బాలిక‌, మైన‌ర్ బాలుడు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకుంటారో లేదో అన్న‌భ‌యంతో కాలేజీలోనే పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. దానిని వీడియో తీసి దాచుకున్నారు. కాలేజీలో విద్యార్థులు పెళ్లిచేసుకున్నార‌న్న విష‌యం తెలియ‌డంతో.. ప్రిన్సిపాల్ వారిద్ద‌రికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించి వేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఆ విష‌యం కాస్త ఆ ఇద్ద‌రు విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది. చ‌దువుకోవాల్సిన వ‌య‌సులో ఈ పిచ్చి ప‌నులేంటంటూ ఆవేద‌న చెందుతున్నారు.

Next Story
Share it