కరవు.. జగన్ ఇద్దరూ కవల పిల్లలు: నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 5:37 AM GMTకరవు.. జగన్ ఇద్దరూ కవల పిల్లలు: నారా లోకేశ్
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఎక్కడ ఉంటే అక్కడే కరవు ఉంటుంది అన్నారు. వైసీపీ పాలనలో రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాంతో.. రాష్ట్రంలో ఉన్న రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు నారా లోకేశ్. ఈ క్రమంలోనే జగన్-కరవు కవల పిల్లలు అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఎక్కడ ఉంటే అక్కడే కరవు ఉంటుందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ పని అయిపోయిందన్నారు. ఐరన్ లెగ్ జగన్‌ను రాష్ట్రమంతా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇక అంతకుముందు సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ కూడా రాశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు తక్షణమే విడుదల చేయాలంటూ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని నారా లోకేశ్ సూచించారు. అంతేకాదు, కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా విద్యార్థి-తల్లి జాయింట్ అకౌంట్ అంటూ మెలికపెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులోచంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జనసేన-టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీతో పాటు జనసేన నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు విసరుతూనే ఉన్నారు.