టీడీపీ, జనసేన అభ్యర్థుల ఉమ్మడి తొలి జాబితా విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
By Srikanth Gundamalla
టీడీపీ, జనసేన అభ్యర్థుల ఉమ్మడి తొలి జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా వెళ్తున్న విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 24 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అయితే.. ఇందులో భాగంగానే తొలి జాబితా విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తొలి జాబితాలో భాగంగా టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక జననసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. టీడీపీ లిస్ట్‌తో పాటు.. పవన్ కళ్యాణ్ జనసేన తరపుణ ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తానని పవన్ చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి, లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయనున్నట్లు తొలి జాబితాలోనే వెల్లడించారు. ఇక టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు.
తొలి జాబితా జనసేన అభ్యర్థులు:
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
రాజానగరం: బల రామకృష్ణుడు
కాకినాడ రూరల్: నానాజీ
తెనాలి: నాదెండ్ల
నెల్లిమర్ల: లోకం మాధవి
తొలి జాబితా టీడీపీ అభ్యర్థులు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 24, 2024
కుప్పం నుంచి పోటీ చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
94 మందితో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు pic.twitter.com/v4dFXwAf44