టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ రియాక్షన్ ఏంటంటే...
తాజాగా జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 3:42 PM ISTటీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ రియాక్షన్ ఏంటంటే...
చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా.. జైల్‌లో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే ముందుకు వెళ్తాయని తెలిపారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్. ఏపీలో అరాచక పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని.. ఏపీ ప్రజల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాజాగా జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విమర్శలు చేశారు. పొత్తులపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా అని పవన్ అన్నా అని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విభేదించారు. కళ్యాణ్ బాబూ.. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరని చురకలు అంటించారు అంబటి రాంబాబు. అంతేకాదు.. అంతకుముందు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్‌పైనా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. జనసైనికులారా ఆలోచించండి.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఎప్పుడో ములాఖత్ అయ్యాడు.. కొత్తగా ఇప్పుడేం ఉందని ఎక్స్ (ట్విట్టర్)లో మంత్రి అంబటి రాంబాబు రాసుకొచ్చారు.
ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్ళు ఎవరూ లేరు కళ్యాణ్ బాబు !@PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) September 14, 2023
జన సైనికులూ... ఆలోచించండి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి లా లేదూ?@JanaSenaParty
— Ambati Rambabu (@AmbatiRambabu) September 14, 2023
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లోనూ విమర్శలు చేశారు. ప్యాకేజీ బంధం బయటపడిందంటూ రాసుకొచ్చారు. పవన్ కళ్యాన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకే అని రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యిందని తెలిపారు. ఇన్నాళ్లు పవన్‌పై నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నమ్మిన వాళ్లను ఈరోజుతో భ్రమలు తొలగింపజేశావంటూ ట్వీట్ చేశారు. ఇక ఇది పొత్తులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని.. ప్రజలు మూకుమ్మడిగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో రాసుకొచ్చారు.
“ప్యాకేజ్ బంధం బయటపడింది”నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb
— YSR Congress Party (@YSRCParty) September 14, 2023