రెచ్చిపోయిన శ్రీకాళహస్తి మహిళా సీఐ..జనసేన నేతకు చెంప దెబ్బలు

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌ మరోసారి రెచ్చిపోయారు.

By Srikanth Gundamalla  Published on  12 July 2023 9:51 AM GMT
Srikalahasti, CI Anju Yadav, Slap, Janasena Leader,

 రెచ్చిపోయిన శ్రీకాళహస్తి మహిళా సీఐ..జనసేన నేతకు చెంప దెబ్బలు

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌ మరోసారి రెచ్చిపోయారు. ఆందోళన చేస్తోన్న జనసేన నాయకుడిపై చెంప దెబ్బలతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో జనసేన నేతలు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. శ్రీకాళహస్తిలోని పెళ్లిమండపం వద్ద సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని సీఐ అంజూయాదవ్‌ జనసేన నేతలకు తేల్చి చెప్పారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పలువురు జనసేన నేతలను అప్పటికే హౌజ్‌ అరెస్ట్‌ కూడా చేశారు పోలీసులు. కానీ కొందరు నేతలు, కార్యకర్తలు కళ్లు గప్పి కళ్యాణమండపం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో సీఐ అంజూయాదవ్‌ ఆగ్రహానికి గురై.. రెచ్చిపోయి ప్రవర్తించారు. జనసేన నేత రెండు చెంపలపై కొట్టారు. అంతేకాదు.. అదంతా వీడియో తీస్తున్న వ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశారు. అతనిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. సీఎం అంజూయాదవ్‌ ప్రవర్తనపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె జనసేన నేత చెంపలపై కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

శ్రీకాళహస్తిలో నిరసన చేస్తున్న జనసేన నేత సాయిని చెంప దెబ్బలు కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. వైసీపీకి ఆమె కార్యకర్తలా పని చేస్తున్నారని.. ఈ సంఘట మరవకముందే అంజూయాదవ్‌ని సస్పెండ్‌ చేయాలని ట్విట్టర్‌ వేదికగా బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

సీఐ అంజూయాదవ్‌ గతంలోనూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాత్రి సమయంలో మహిళను కొట్టి బలవంతంగా పోలీస్‌ జీపు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ సదురు మహిళను కొడుతూ జీప్‌ ఎక్కించిన వీడియోలు కూడా అప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సదురు మహిళ భర్త కోసం వెళ్లిన సీఐ అంజూయాదవ్‌ అతడు లేడని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళను జీప్‌లో ఎక్కించింది.

Next Story