ఏపీకి విద్యార్థిని చదువుకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్

నటుడు సోనూసూద్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.

By Srikanth Gundamalla
Published on : 19 July 2024 2:00 PM IST

sonu sood, help,  andhra pradesh student,   studies,

ఏపీకి విద్యార్థిని చదువుకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్

నటుడు సోనూసూద్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. రీల్‌ లైఫ్‌లో ఆయన ఎక్కువ సినిమాల్లో విల్‌నగా చేసినా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ఆయన హీరో అని నిరూపించుకున్నారు. కరోనా సమయంలో తనకు తోచిన సాయం చేశాడు. ఎంతో మందిని విదేశాల నుంచి స్వదేశానికి తీసుకొచ్చాడు .అంతేకాదు.. కష్టాల్లో ఉన్నట్లు ఎవరైనా కనబడితే చాలు వివరాలు సేకరించి మరీ ఆదుకున్నాడు. తాజాగా సోనూసూద్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేద విద్యార్థినికి అండగా నిలబడ్డాడు. ఆమె చదువుకు అవసరమైన సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు నటుడు సోనూసూద్.

ఏపీలోని బనవనూరుకి చెందిన దేవికుమారి అనే యువతి బీఎస్సీ చదవాలని అనుకంది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు తన చదువుకి అస్సలు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే సదురు విద్యార్తిని పరిస్థితి తెలియజేస్తూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. విద్యార్థిని చదువుకి సోనూసూద్‌ సాయం చేయాలంటూ ట్యాగ్‌ చేశారు. దాంతో.. సోనూసూద్‌ ఈ పోస్టు చూసి వెంటనే స్పందించారు. విద్యార్థిని చదువుకి అవసరమైన సాయం తాను చేస్తానని చెప్పాడు. ఈ మేరకు రీపోస్టు చేశాడు సోనూసూద్. కాలేజ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు.. నీ చదువు ఆగదు అంటూ పోస్టులో రాసుకొచ్చారు. నెటిజన్లు సోనూసూద్‌ చొరవ తీసుకుని సాయం చేయడానికి ముందుకు రావడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భూమిపై ఉన్న దేవుడంటూ పలువురు కొనియాడుతున్నారు.

Next Story