లెక్కింపునకు ఏర్పాట్లు మొదలయ్యాయి

SEC Conducted review meeting on Parishad Eelections Counting Arrangements. ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ

By M.S.R  Published on  17 Sept 2021 8:00 PM IST
లెక్కింపునకు ఏర్పాట్లు మొదలయ్యాయి

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 19న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్ఈసీ నీలం సాహ్నీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ.. ఈ నెల 19న నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా, జిల్లా కలెక్టర్లు, జిల్ఠా ఎస్పీలను ఆయన ఆదేశించారు. ఆలాగే, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని ఏపీ సీఎస్ కలెక్టర్లుకు స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలను సీఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని సీఎస్ కలెక్టర్లును ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు గానూ 275 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌లో 41 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. 126 జడ్పీటీసీలు, 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 515 జడ్పీటీసీ స్ధానాలకు 2,058 మంది, 7,220 ఎంపీటీసీలకు 18,782 మంది పోటీ చేశారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ స్ధానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.

Next Story