తగ్గిన కరోనా కిట్ల ధరలు.. ఒక్కో కిట్‌ ధర ఎంతంటే..?

Reduced corona kits prices .. కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుము

By సుభాష్  Published on  18 Nov 2020 11:26 AM IST
తగ్గిన కరోనా కిట్ల ధరలు.. ఒక్కో కిట్‌ ధర ఎంతంటే..?

అమరావతి: కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఇక కరోనా నిర్ధారణకు వాడే కిట్ల ధరలు ప్రస్తుతం దిగొచ్చాయి. కోవిడ్‌ వచ్చిన మొదట్లో కిట్ల ధరలు అధికంగా ఉండేవి. అయితే కిట్లు ల్యాబోరేటరీ రసాయనాల కొనుగోళ్లకు రాష్ట్రాలకు రాష్ట్రాలే ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. ఇక ఏపీలో ప్రతి రోజు కరోనా పరీక్షలకు రూ.5 కోట్లకుపైగా ఖర్చు అయ్యేది. ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలంటే రూ.4 వేలు వ్యయం అయ్యేది. ఒక్క ఆర్టీపీసీఆర్‌ కిట్‌ ధర రూ. 1000 ఉండేది. అలాంటిది తాజాగా ఏపీ సర్కార్‌ టెండర్లకు వెళ్లగా కేవలం రూ.55కు ధర దిగొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ వచ్చిన కొత్తల్లో పరిస్థితుల మేరకు భారీగా వ్యయం చేయాల్సి వచ్చింది.


ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీలో కరోనా పరీక్షలు భారీ స్థాయిలో నిర్వహించింది. కరోనా పరీక్షల్లో ఏపీ రాష్ట్రంలో దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచింది. ఇక ఏపీ తరచూ టెండర్లకు వెళ్లడం వల్ల 80 నుంచి 90 శాతం తగ్గిన ధరలతో కొనుగోలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ కిట్లు రూ.350తో కొనుగోలు చేస్తుండగా, తాజా టెండర్లలో దీని ధర కేవలం రూ.55కు వచ్చింది. ఒకప్పుడు సాధారణ సర్జికల్‌ మాస్క్‌ను రూ.13 నుంచి రూ.16 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అది రూ.2.50కి పడిపోయింది. ఈ ధరతో ప్రభుత్వం 25 లక్షల మాస్కులు కొనుగోలు చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.1,900 నుంచి వెయ్యికి తగ్గించింది.

Next Story