అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేశ్ పేరుని చేర్చిన సీఐడీ
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా లోకేశ్ పేరుని సీఐడీ అధికారులు చేర్చారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 1:44 PM ISTఅమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేశ్ పేరుని చేర్చిన సీఐడీ
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరుని సీఐడీ అధికారులు చేర్చారు. ఈ మేరకు కేసులో ఆయన పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టు సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేశ్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని ఏసీ సీఐడీ అభియోగులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెమోలో నారా లోకేశ్ పేరుని ఏ14లో మెన్షన్ చేసింది. సీఐడీ మెమోపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇక ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుని కూడా సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబుని బెయిల్‌పై బయటకు రప్పించేందుకు న్యాయవాదులతో మాట్లాడుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్ పేరుని చేర్చడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో నారా లోకేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.