టీడీపీ నేత నారా లోకేష్‌కు స్కానింగ్

టీడీపీ నాయకుడు నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన మే 18వ తేదీ నంద్యాలలోని ఓ

By M.S.R  Published on  18 May 2023 4:00 PM IST
MRI scanning, TDP leader, Nara Lokesh, shoulder pain

టీడీపీ నేత నారా లోకేష్‌కు స్కానింగ్ 

టీడీపీ నాయకుడు నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన మే 18వ తేదీ నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా ప్రజలు, కార్యకర్తల భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది. అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో లోకేష్ మరోసారి వైద్యులను సంప్రదించారు. 50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచించారు. ఈ మేరకు నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ వచ్చిన లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కాన్ చేశారు.

లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో 103వ రోజుకు చేరుకుంది. 102వ రోజు లోకేష్ 8కి.మీ దూరం నడవగా ఇప్పటి వరకు 1301.8 కి.మీ పాదయాత్ర సాగింది. నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించిన నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. పేదోడినంటూ జగన్ జబర్‌దస్త్ కామెడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తల్లీ, చెల్లి పారిపోయారు కాబట్టి జగన్ ఒంటరి వాడేనని వ్యాఖ్యానించారు. యువగళం ప్రజాగళమై మహోద్యమంగా మారిందన్న యువనేత తమతో పెట్టుకుంటే మాటాష్ అయిపోతావని జగన్‌ను హెచ్చరించారు.

Next Story