గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసుల తీరుపై అసంతృప్తిలో ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  17 Oct 2023 6:00 AM GMT
mla balineni, surrender, police security, ongole,

గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసుల తీరుపై అసంతృప్తిలో ఉన్నారు. తాజాగా ఆయన డీజీపీ, గుంటూరు రేంజ్‌ ఐజీలకు లేఖ రాశారు. తనకు పోలీసులు కల్పిస్తున్న రక్షణ అవసరం లేదన్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా గన్‌మెన్‌లను సరెండర్ చేశారు. అయితే.. ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసు విషయంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గన్‌మెన్లను సరెండర్ చేయడంపై జిల్లాలో చర్చ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

నకిలీ భూపత్రాల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని మాజీ మంత్రి బాలినేని తనల లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్దన్నారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఏపీలో నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని బాలినేని తన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే తన గన్‌మెన్‌లను సరెండర్ చేస్తున్నట్లు బాలినేని తెలిపారు.

జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మంది అరెస్టు అయ్యారు. ఇప్పటికే ప్రధాన సూత్రధారి పూర్ణచంద్రరావుతో మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు. నకిలీ పట్టాలు తయారు చేసి భూవివాదాలకు పాల్పడుతున్న ముఠాలపై కూడా సిట్‌ ఆరా తీస్తోంది. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఇదిలా కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని లేఖ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

Next Story