సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కారు: మంత్రి రోజా
సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని మంత్రి రోజా చెప్పారు.
By Srikanth Gundamalla
సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కారు: మంత్రి రోజా
పుత్తూరు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో రైతు భరోసా, సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించారు. ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందనిచెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారించే దిశగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. ఇక రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురుచూసే పరిస్థితులు కూడా లేవన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయానికే వాలంటీర్లకు పెన్షన్ అందిస్తున్నామని మంత్రి రోజా పేర్కొన్నారు.
సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని మంత్రి రోజా చెప్పారు. ప్రజల కోసం ఎన్నో సార్లు బటన్లను నొక్కారనీ చెప్పారు. ఇప్పుడు ప్రజల వంతు వచ్చిందనిచెప్పారు. 2024లో జగన్ ప్రభుత్వం మళ్లీ రావడం కోసం రెండు సార్లు బటన్లు నొక్కాలన్నారు. మొదటి బటన్ ఎమ్మెల్యేకు.. రెండో బటన్ ఎంపీ కోసం నొక్కి వైసీపీ అండగా నిలవాలని మంత్రి రోజా కోరారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే వెంటనే నష్ట పరిహారం అందిస్తున్నామనీ అన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఈ పని సులువుగా జరిగిపోతుందని మంత్రి రోజా చెప్పారు.
ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నామని రోజా తెలిపారు. ఇలా సీఎం జగన్ గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చదువుతున్న పిల్లల చదువులు చక్కబడ్డాయని అన్నారు. పిల్లలు ఇప్పుడు స్టేట్ ర్యాంకుల స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఇందుకు కారణమని మంత్రి ఆర్కే రోజా అన్నారు.