ఏపీ ర‌వాణాశాఖ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం నెల‌కొంది. పేర్ని నానికికి మాతృవియోగం క‌లిగింది. గ‌తకొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న పేర్ని త‌ల్లి నాగేశ్వ‌ర‌మ్మ ఈ రోజు క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. రెండ్రోజుల క్రితమే ఆంధ్రా హాస్పిటల్ నుంచి నాగేశ్వరమ్మ డిశ్చార్జ్ అయ్యారు.

ఉదయం మరోసారి నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే నాగేశ్వరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. తల్లిని కోల్పోయిన పేర్ని నానికి సీఎం జగన్ తన సంతాపం తెలియజేశారు. తీవ్ర విచారంలో ఉన్న నానికి ఆయన ధైర్యం చెప్పారు.

సుభాష్

.

Next Story