సంచలన నిర్ణయం తీసుకున్న లక్ష్మీపార్వతి
నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By M.S.R Published on 12 Jun 2024 5:45 PM ISTసంచలన నిర్ణయం తీసుకున్న లక్ష్మీపార్వతి
నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ తెలుగు అకాడమి చైర్ పర్సన్‌గా పని చేస్తున్న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వం మారడంతో లక్ష్మీపార్వతి రాజీనామా చేశారు. గత ప్రభుత్వంలో లక్ష్మీపార్వతిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు అకాడమీ చైర్మన్‌ను చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ పదవికి రాజీనామా చేశారు.
గత ప్రభుత్వంలో నామినేటెట్ పదవులు దక్కించుకున్న నేతలు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేశారు. అనంతపురంలో ఏడీసీసీ బ్యాంకు, డీసీఎంఎస్ పాలకవర్గాలు కూడా రాజీనామా చేశాయి. కొత్త ప్రభుత్వం రావడంతో సొసైటీల ప్రతినిధులు, పాలకవర్గాలు వెంటనే రాజీనామాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన పరిపాలన కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.