కాకినాడలో విషాదం, నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి

కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలుడులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 3:21 PM IST
Kakinada, Gun Fire,  Girl Dead,

 కాకినాడలో విషాదం, నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి

కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలుడులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పందులను చంపుతున్న క్రమంలో ఒక తూటా చిన్నారికి తగిలినట్లు సమాచారం. తీవ్ర రక్త స్రావం కావడంతో చిన్నారి చనిపోయింది

కాకినాడ జిల్లాలోని తుని మండలం వెలమకొత్తూరులో చోటుచేసుకుంది ఈ విషాద సంఘటన. గ్రామస్తులు పెంపుడు పందులను చంపేందుకు నాటు తుపాకీని వినియోగించారని తెలుస్తోంది. పరిగెడుతున్న పందులను చంపేందుకు నాటు తుపాకీ గురిపెట్టి కాల్పలు జరిపారని సమాచారం. అయితే.. తుపాకీ కాల్పులు గమనించని నాలుగేళ్ల చిన్నారి అక్కడే ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్‌ ఈ చిన్నారినికి తగిలింది. దాంతో.. ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. పాప అరుపులతో స్పందించిన స్థానికులు చిన్నారి దగ్గరకు పరిగెత్తారు. తీవ్ర గాయం కావడం వల్ల ఎక్కువగా రక్త స్రావం అయ్యింది.

చిన్నారి కుటుంబ సభ్యులు పాపను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ప్రకటించారు. చనిపోయిన చిన్నారి పేరు ధన్యశ్రీగా పోలీసులు తెలిపారు. నిబంధనలుకు విరుద్ధంగా నాటు తుపాకులు వినియోగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దర్యాప్తు చేస్తున్నామని.. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని పోలీసులు వివరించారు.

Next Story