గుడ్‌న్యూస్.. ఇక విజయవాడలోనే పాస్‌పోర్ట్‌ సేవలు

ఏపీ ప్రజలకు శుభవార్త. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రానుంది.

By Srikanth Gundamalla  Published on  28 Oct 2023 3:35 PM IST
good news,  ap people, passport, vijayawada,

గుడ్‌న్యూస్.. ఇక విజయవాడలోనే పాస్‌పోర్ట్‌ సేవలు

ఏపీ ప్రజలకు శుభవార్త. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు హర్ష. రీజనల్ పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి రోజుకు 2 వేల దరఖాస్తులు వస్తున్నాయని, కొవిడ్ తర్వాత పాస్ పోర్ట్ కోసం అప్లై చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పాస్ పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. అక్టోబర్ నెల వరకు 3 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామన్నారు. విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయన్నారు.

పోస్టల్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్ట్స్ త్వరితగతిన అందిస్తున్నామని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ శివ హర్ష వెల్లడించారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగానే ఇకపై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. మరో 2, 3 నెలల్లోనే రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం పాస్ పోర్ట్ సేవలు సులభతరం చేశామని, తక్కువ సమయంలోనే అప్లై చేసిన వారికి పాస్‌ పోర్ట్‌లు అందిస్తున్నామని అన్నారు. ఫేక్ సైట్స్, బ్రోకర్ల ద్వారా పాస్‌పోర్ట్‌లు పొందాలని ప్రయత్నించి చాలా మంది మోసపోతున్నారని చెప్పారు. ఇలాంటి వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని రీజనల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్ శివ హర్ష కోరారు.

Next Story