అక్రమంగా ఇరికించారు.. కుమారుడి అరెస్ట్‌పై మాజీ మంత్రి పినిపె విశ్వరూప్

ద‌ళిత యువ‌కుడి హ‌త్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on  21 Oct 2024 7:49 AM GMT
అక్రమంగా ఇరికించారు.. కుమారుడి అరెస్ట్‌పై మాజీ మంత్రి పినిపె విశ్వరూప్

ద‌ళిత యువ‌కుడి హ‌త్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడు అరెస్టుపై విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో తన కుమారుడిని అక్రమంగా హత్య కేసులో ఇరికించారని మండిపడ్డారు. హత్య కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తన కుమారుడిని ఇరికించారని అన్నారు. చనిపోయిన వ్యక్తి తమ వైసీపీ పార్టీ కార్యకర్తేనని చెప్పారు. త‌న 35 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో త‌న‌పై ఎలాంటి కేసులు లేవ‌న్నారు. నా కుమారుడు రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఉద్దేశంతో యాక్టివ్‌గా ఉన్నాడ‌ని తెలిపారు. త‌న కొడుకు ఒక‌ డాక్టర్‌.. త‌న‌కు ప్రాణాలను కాపాడడం మాత్రమే తెలుసు.. ప్రాణాలు తీయడం తెలియ‌దు అని అన్నారు.

ఎఫ్ఐఆర్ లో కూడా తన కుమారుడు శ్రీకాంగ్‌ పేరు ఎక్కడా లేదని.. మధురైలోని ఆలయ దర్శనానికి వెళ్లి వస్తున్న తన కుమారుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. రాజకీయ కక్షతో ఈ కేసులోని నిందితులతో తన కుమారుడి పేరు చెప్పించి.. తప్పుడు కేసు పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని.. కోనసీమలో కక్షా రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోస్తోందని ఆరోపించారు.


Next Story